Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Day: January 31, 2019

Aaron Cooper January 31, 2019

న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.

Aaron Cooper January 31, 2019

న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస్తాయని, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.

Aaron Cooper January 31, 2019

హైదరాబాద్/న్యూఢిల్లీ: టైమ్స్ నౌ – వీఎంఆర్ ప్రీపోల్ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 11 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 5 సీట్లు వస్తాయని తేలింది. యూపీఏ అని చెప్పినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ మేరకు సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.

Aaron Cooper January 31, 2019

అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.

Aaron Cooper January 31, 2019

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుధవారం నిప్పులు చెరిగారు. ఆమె ట్విట్టర్ లైవ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు.