Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Month: January 2019

Aaron Cooper January 31, 2019

న్యూఢిల్లీ: ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒంటరిగా విజయం సాధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కానీ బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది.

Aaron Cooper January 31, 2019

న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 147 సీట్లు వస్తాయని, ఇతరులకు 144 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే ప్రీపోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ ప్రీపోల్ సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.

Aaron Cooper January 31, 2019

హైదరాబాద్/న్యూఢిల్లీ: టైమ్స్ నౌ – వీఎంఆర్ ప్రీపోల్ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు 11 నుంచి 12 సీట్లు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 5 సీట్లు వస్తాయని తేలింది. యూపీఏ అని చెప్పినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ మేరకు సర్వే ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.

Aaron Cooper January 31, 2019

అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.

Aaron Cooper January 31, 2019

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుధవారం నిప్పులు చెరిగారు. ఆమె ట్విట్టర్ లైవ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Aaron Cooper January 30, 2019

హైదరాబాద్‌ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దాదాపు 3,500 పంచాయతీ స్థానాలకు 32 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

Aaron Cooper January 30, 2019

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేపు (బుధవారం) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పార్టీలను ఆహ్వానించింది. దీనిపై జనసేనానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Aaron Cooper January 30, 2019

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. రాష్ట్ర విభజన అనంతరం, కొన్నేళ్ల క్రితం అనంతపురంకు పరిశ్రమలు వస్తాయని తాము చెబితే ఎవరూ నమ్మలేదని, కానీ ఇక్కడ నీటి వసతులు కల్పించి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు పారిశ్రామిక రంగానికి అనుకూలంగా చేయడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు

Aaron Cooper January 30, 2019

అమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం ఆమోదించారు. రావెల 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. గత కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఇటీవల జనసేన

Aaron Cooper January 30, 2019

కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో చేరడానికి షరతులు పెడుతున్నారు. కర్నూలు లోకసభతో పాటు మరో రెండు మూడు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు. కర్నూలు లోకసభను అడగడం బుట్టా రేణుకకు మింగుడు పడటంలేదు.