
పాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీంను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాజాగా, ఆదివారం బీహార్లో మరో ప్రకటన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ పాట్నాలో నిర్వహించిన జన ఆకాంక్ష సభలో మాట్లాడారు.